భాషల్లో తేడాలు గుర్తించే గర్భస్థ శిశువులు!

20 Jul, 2017 02:50 IST|Sakshi
భాషల్లో తేడాలు గుర్తించే గర్భస్థ శిశువులు!
గర్భంలో ఉండే శిశువు ఎనిమిదో నెల నుంచి వేర్వేరు భాషలను గుర్తించగలదని అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. కాన్సస్‌ విశ్వవిద్యాలయ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు 24 మంది గర్భిణులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. గర్భస్థ శిశువుల గుండె చప్పుళ్లతోపాటు అతిసూక్ష్మ స్థాయిలో ఉండే అయస్కాంత క్షేత్రాలను గుర్తించే బయోమాగ్నెటో మీటర్స్‌ను ఇందులో ఉపయోగించారు. ఇంగ్లిష్, జపనీస్‌ భాషల్లో రికార్డు చేసిన కొన్ని మాటలను వినిపించారు.

ఇంగ్లీష్‌ భాషలో సంభాషణలు విన్నప్పుడు శిశువు గుండె చప్పుడు సాధారణంగా ఉండగా.. జపనీస్‌ భాషలో విన్నప్పుడు మా త్రం స్పష్టమైన తేడాలు కనిపించాయి. రెండు భాషల ఉచ్ఛారణల్లో తేడా ఉండటం వల్ల ఇలా జరుగుతుందని.. తల్లి మాటలతోపాటు గర్భంలో ఉండే శబ్దాలకు అలవాటు పడ్డ శిశువు ఇతర భాషలో మాటలు విన్నప్పుడు వచ్చిన స్పందన గుండె చప్పుడులో మార్పులకు కారణమవుతోందని పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మినాయి తెలిపారు. 
>
మరిన్ని వార్తలు