పిల్లలు వేళ్లు చీకడం మంచిదే!

11 Jul, 2016 22:56 IST|Sakshi
పిల్లలు వేళ్లు చీకడం మంచిదే!

మెల్‌బోర్న్: మీ పిల్లలకు వేళ్లు చీకడం, గోళ్లు కొరకడం లాంటి అలవాట్లున్నాయా? అవి చేయవద్దని మీరు పిల్లల్ని వారిస్తున్నారా? అయితే ఇది చదవండి. చిన్నతనంలో వే ళ్లు చీకడం, గోళ్లు కొరకడం వంటివి చేసే పిల్లలు అలర్జీల బారిన పడే ప్రమాదం తక్కువని పరిశోధనలో తేలింది. పెద్దయ్యాక కూడా వారి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందట. పిల్లలకు గనుక ఈ రెండు అలవాట్లూ ఉంటే వారు మరింత ఎక్కువ నిరోధకతను పొందుతారు.

ఇంట్లోని దుమ్ము, తలలో ఉండే పేలు, గడ్డి, పిల్లులు, కుక్కలు, గుర్రాలు ఇంకా గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మజీవులు వీరిపై తక్కువ ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలంటున్నారు. చిన్నతనంలో దుమ్ము, సూక్ష్మజీవులను నిరోధించే శక్తిని పొందితే అది పెద్దయ్యాక కూడా ఉపయోగపడుతుందని, అలాంటి వారికి అలర్జీలు సోకే ప్రమాదం తక్కువని కెనడాలోని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మాల్కోమ్ సియర్స్ చెప్పారు.

మరిన్ని వార్తలు