పాక్‌ను పీడించేవి ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే!

2 Nov, 2019 05:44 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్‌ సమస్య కాదని గల్లప్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌లో గల్లప్‌ అండ్‌ గిలానీ ప్రచురించిన ఈ అధ్యయనంలో ప్రతిస్పందించిన వారిలో 53 శాతం మంది దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరో తీవ్రమైన సమస్య నిరుద్యోగమని 23 శాతం మంది వెల్లడించారు. అవినీతి, నీటిసమస్య తీవ్రమైందని 4 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు  తేలింది. అయితే పాకిస్తాన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్టు కశ్మీర్‌ సమస్య తీవ్రమైన సమస్య అని అక్కడి ప్రజలు అనుకోవడంలేదని పేర్కొంది. ప్రజల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్‌ అంశం దేశానికి తీవ్రమైన విషయమని అభిప్రాయ పడుతున్నారని సర్వే తెలిపింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు