జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు

11 Jul, 2016 01:51 IST|Sakshi
జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు

హూస్టన్ : కాపలాగా ఉన్న గార్డు ప్రాణాన్ని రక్షించడానికి జైల్లో ఉన్న ఖైదీలు తలుపు బద్దలుకొట్టి వచ్చిన అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ సిటీలోని జిల్లా కోర్టుల భవనంలో ఒక జైలు గదిలో 8 మంది ఖైదీలను ఉంచారు. వారి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి. అప్పటివరకు వారితో సరదాగా మాట్లాడుతూ ఉన్న గార్డు గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు.

ఖైదీలు ఎంతగా అరిచినా ఎవరూ రాకపోవడంతో వారు చేతులు కట్టివేసి ఉన్నప్పటికీ తలుపు బద్దలుకొట్టి గార్డు వద్దకు వచ్చారు. సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. కోర్టులో ఉన్న అధికారులు పరిగెత్తుకొని వచ్చారు. వారు గార్డును కాపాడటాన్ని చూసి విస్మయం చెందారు. వెంటనే ఆస్పత్రికి ఫోన్‌చేసి గార్డుకు చికిత్స అందించారు.

మరిన్ని వార్తలు