20 అంతస్తుల ఫోన్.. జేబులో పట్టేదెలా!

11 Mar, 2016 09:21 IST|Sakshi
20 అంతస్తుల ఫోన్.. జేబులో పట్టేదెలా!

బీజింగ్: నూతన ఆవిష్కరణలు చేసే విషయంలో చైనా మిగితా దేశాలకన్నా ముందుంటుందనే చెప్పాలి. ఇప్పటికే వినూత్న పద్ధతిలో భవంతులు నిర్మిస్తున్న చైనా మరోసారి చూసేవారిని అవాక్కయ్యేలా చేసింది. చూడగానే గబుక్కున తీసుకొని జేబులో వేసుకోవాలనిపించేలా తొలినాళ్లలో వచ్చిన సెల్ఫోన్లాంటి 20 అంతస్తుల భవంతిని చైనాలోని కన్మింగ్ నగరంలో నిర్మించింది. అది కూడా ఓ మహిళ చేతిలో అది ఉన్నట్లుగా. కిటికీలను సెల్ ఫోన్ కీ పాడ్ నంబర్లుగా అమర్చింది.

చివరి అంచున ఎంటెనా రూపంలో ఓ పెద్ద నీళ్ల ట్యాంకులాంటి దాన్ని అమర్చారు. గతంలోనే 2014లో ఆన్ లైన్ పోల్ నిర్వహించినప్పుడు ప్రపంచంలోని అత్యంత చెత్త భవంతుల్లో ఈ భవనం టాప్ టెన్ లో చోటుదక్కించుకోగా.. తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తోంది. గతంలో దీనిని చెత్త జాబితాలో చేర్చిన ఓటర్లు ఈసారి మాత్రం ఆ భవంతిని తెగ పొగిడేస్తున్నారు. దాన్ని ఎందుకు చెత్త భవంతి అంటున్నారో అర్థం కావడం లేదని, చూడగానే ఎంతో ఆకర్షించేలా దాని నిర్మాణం ఉందని అంటున్నారు. ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి నిర్మాణాన్ని మళ్లీ మళ్లీ నిర్మించాలని అనిపిస్తుందని కూడా ప్రస్తుతం నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు