అవి భారతీయులు ఇష్టపడటం లేదు!

5 Jul, 2016 18:17 IST|Sakshi

ఇన్సూరెన్స్ లు చేయించుకోవడం పట్ల ఎక్కువ మంది భారతీయులు అనాసక్తిని కలిగి ఉంటున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఇన్సూరెన్స్ లు చేయించుకుంటున్న వారిలో 14శాతంతో దక్షిణాఫ్రికా ప్రజలు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణ కొరియా, జపాన్, యూనైటెడ్ కింగ్ డమ్ లు ఉన్నాయి. అత్యల్పంగా ఇన్సూరెన్స్ లు చేయించుకుంటున్నవారిలో 0.8శాతంలో పాకిస్తాన్ చివరిస్థానంలో నిలవగా, 3.3 శాతంతో భారత్ చివర నుంచి ఐదో స్థానంలో ఉంది.

గత పదిహేనేళ్లలో భారత్ లో ఇన్సూరెన్స్ చేయించుకుంటున్న వారి సంఖ్యలో కూడా ఎటువంటి గణనీయమైన మార్పులు కనిపించడం లేదు. 2001లో 2.71 శాతం మంది భారతీయులు ఇన్సూరెన్స్ లు తీసుకున్నారు. వీరిలో లైఫ్ ఇన్సూరెన్స్ లు చేయించుకున్నవారు 2.15కాగా, కేవలం 0.56 శాతం మంది ఇతర ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నారు. 2014లో ఇన్సూరెన్స్ లు తీసుకున్న వారి శాతం 3.3కు పెరగగా.. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లు తీసుకునే వారి శాతం 0.7కు పడిపోయింది.

>
మరిన్ని వార్తలు