ఇంటర్నెట్ అతిగా వాడుతున్నారా..

21 Sep, 2016 11:39 IST|Sakshi
ఇంటర్నెట్ అతిగా వాడుతున్నారా..
స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత గంటలకొద్ది ఆన్లైన్లోనే గడుపుతున్నారు. అయితే.. యువతలో పెరిగిపోతున్న ఈ ధోరణి తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అంతర్జాలంలో ఎక్కువ సమయం గడిపే యువత అసలు ఏ పనిమీదా సరైన ఏకాగ్రత చూపించడంలేదని మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
కెనడాలోని మెక్మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు.. ఎక్కువ సమయం ఇంటర్నెట్ వాడకం అనేది యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశంపై 'ఇంటర్నెట్ అడిక్షన్ టెస్ట్' ద్వారా కొంతమందిని ఎంచుకొని పరిశోధన నిర్వహించారు. దీనిలో వెల్లడైన ఫలితాల ప్రకారం.. ఎక్కువ సమయం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో గడుపుతున్న యువతలో నిరాశావాదం పెరగడంతో పాటు.. వారు దేనిపై సరైన ఏకాగ్రత చూపించడం లేదని గుర్తించారు. ఇలాంటి వారు తమ రోజు వారి కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో విఫలమౌతున్నారని.. వీరి సమయపాలన కూడా గాడి తప్పుతుందని తెలిపారు. ఆధునిక మానసిక సమస్యలలో ఇంటర్నెట్ అడిక్షన్ కీలకపాత్ర వహిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మైఖేల్ వాన్ వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు