వర్క్‌ప్లేస్‌: ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌

11 Oct, 2016 15:57 IST|Sakshi
వర్క్‌ప్లేస్‌: ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌

లండన్‌: మైక్రోసాఫ్ట్‌ యామ్మర్, సేల్స్‌ఫోర్స్‌ చాట్టర్‌ అండ్‌ స్లాక్‌లకు పోటీగా ఫేస్‌బుక్‌ వర్క్‌ప్లేస్‌ అనే కొత్త అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కార్యాలయాల్లో వాడుతున్న ఇంట్రానెట్, మెయిల్‌బాక్స్, ఇతర అంతర్గత సమాచార వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా దీనిని ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టింది.

రెండేళ్ల క్రితమే ఫేస్‌బుక్‌ లండన్‌ కార్యాలయంలో దీనిని అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా 1,000 సంస్థల్లో పరీక్షించారు. ఈ సేవలను స్వచ్ఛంద, విద్యా సంస్థలకు ఫేస్‌బుక్‌ ఉచితంగా అందించనుంది. మిగతా కంపెనీల వారికి రుసుము ఉంటుంది.

మరిన్ని వార్తలు