హ్యాకర్స్ టార్గెట్ ఐఫోన్ యూజర్లే..

29 Dec, 2015 18:49 IST|Sakshi
హ్యాకర్స్ టార్గెట్ ఐఫోన్ యూజర్లే..

దుబాయి : సెల్ఫోన్లు నిత్యవసర వస్తువుగా మారిపోయిన ఈ రోజుల్లో కొన్నిసార్లు వాటి వాడకం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోవడం చేస్తుంటాం. అయితే, ఐఫోన్ వాడే యూఏఈ కస్టమర్లను నిపుణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత డాటా, సెల్ఫీ ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఎస్సెమ్మెస్, ఆఫీస్ డాటా ఇలా చాలా రకాల సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే అవకాశాలు ఉన్నాయని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.

ఫాలో అల్టో నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన వైట్ పేపర్.. మ్యాక్, పర్సనల్ కంప్యూటర్ల నుంచి డాటా ఎలా హ్యాక్ అవుతాయో తెలుపుతుంది. ముఖ్యంగా ఐఓఎస్ ఫోన్లు.. హ్యాకర్ల తొలి లక్ష్యంగా మారుతున్నాయట. బ్యాక్స్టాబ్ అనే టెక్నిక్ వాడి  హ్యాకర్లు డాటాను సంపాదిస్తారు. ఐఫోన్ యూజర్స్ కోసం ఐట్యూన్స్ క్రియేట్ చేసి డాటా ఎన్క్రిప్ట్ చేసి మన డాటాను హ్యాక్ చేస్తారని హెల్ప్ ఏజీ టెక్నికల్ డైరెక్టర్ నికోలాయ్ సాల్లింగ్ తెలిపారు.


నికోలస్ సూచించిన జాగ్రత్తలు:
⇒ ఐఫోన్ బ్యాక్ అప్ ఎన్క్రిప్ట్ చేసుకోవాలి.  ఐ క్లౌడ్ బ్యాక్ అప్ సిస్టమ్లో ఐట్యూన్స్ బ్యాక్ అప్  ఎన్క్రిప్ట్ చేసుకుని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
⇒ లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ని యూజర్స్ అప్ డేట్ చేయాలి
⇒ డాటా కేబుల్ ద్వారా మొబైల్ ని కంప్యూటర్కు కనెక్ట్ చేసినప్పుడు 'ట్రస్ట్' ఆప్షన్ మీద క్లిక్ చేయవద్దు.
⇒ జెయిల్బ్రేక్, రూట్ ప్రాసెస్ చేయవద్దు.
⇒ ట్రస్ట్డ్(నమ్మదగిన) యాప్స్ మాత్రమే ఇన్స్టాట్ చేసుకోవాలి.
⇒ మొబైల్ యాప్స్ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.
⇒ మీ మొబైల్ వాడుతున్నప్పుడు ఇతరులు చూడరాదని భావించిన పనులు, యాక్టివిటీస్ చేయకపోవడమే మంచిది. ట్రాకింగ్ సిస్టమ్, షేరింగ్ లొకేషన్స్ ఇందులో ప్రధానంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు