కరోనా ప్రకంపనలు: ఒక్క రోజులో 54 మరణాలు 

10 Mar, 2020 17:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వణికిస్తున్న  కరోనా  వైరస్‌

 గత 24 గంటల్లో  54 మరణాలు నమోదు

టెహ్రాన్‌:  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌)  ఇరాన్‌లో మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్‌ దెబ్బ భారీగా తాకిన పశ్చిమ ఆసియా దేశం ఇరాన్‌లో గత 24 గంటల్లో 54 మంది కరోనా వైరస్‌తో కన్నుమూసారని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశంలో ఒక రోజులో అత్యధికంగా ఈ వైరస్‌కు బలికావడం మరింత ఆందోళన రేపుతోంది. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్‌లో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 291 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానౌష్ జహాన్పూర్  మీడియాకు చెప్పారు. అలాగే 881 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 8,042 కు చేరుకుందని తెలిపారు.

అటు ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్  ఆందోళన నేపథ్యంలో దేశంలో సిరీస్ ఏ తో పాటు అన్ని రకాల క్రీడల టోర్నమెంట్లను రద్దు చేస్తున్నామని ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే  ప్రకటించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు గుమిగూడడాన్ని నిషేధించిన నేపథ్యంలో , క్రీడల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నందువల్ల అన్ని పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు