ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసేందుకు..

28 Oct, 2015 17:49 IST|Sakshi
ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసేందుకు..

టెహ్రాన్: ఉగ్రవాదుల చేతిలో చిక్కిన సిరియా ప్రాంతాలను విముక్తి చేసేందుకు ఇరాన్ మరింత క్రియాశీలంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో ఆ దేశ బలగాలను మోహరించి ఉగ్రవాదుల పనిపడుతుండగా.. మరింత సైన్యాన్ని యుద్ధరంగంలోకి దించుతుంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ మీద ఉన్న విశ్వాసం, నమ్మకంతోనే తాము వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని, అక్కడ ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసేందుకు సిరియాకు ఎన్నివిధాల సహాయమైనా చేస్తామని ఇరాన్ సైనికాధికారులు తెలిపారు.

మరోపక్క, ఇరాన్ అందిస్తున్న సైనిక సహాయంపట్ల సిరియా కృతజ్ఞతలు తెలిపింది. నేరుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో తలపడటంలోనూ, వ్యూహాత్మక దాడులను చేయడంలోనూ ఇరాన్ ఎంతో సహాయపడుతుందని అందుకు ధన్యవాదాలని కూడా తెలిపింది. ఆయుధాలను సమకూర్చడంలో, తక్షణమే స్పందించడంలో ఇరాన్ సహకారం మర్చిపోలేమన్నారు. సిరియాలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు