ఇరాన్‌ ఉపాధ్యక్షురాలిని వదలని కరోనా

28 Feb, 2020 19:22 IST|Sakshi

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ఇరాన్‌ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు కరోనా సోకడంతో ఇరాన్‌ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. రిపోర్టులు శనివారం వచ్చే అవకాశం ఉందని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. చదవండి: అన్ని వైరస్‌ల కన్నా ప్రాణాంతకం ఇదే..

ఎబ్తేకర్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమెకు కోవిడ్-19 సోకిందనే వార్త బయటికి రావడానికి ఒకరోజు ముందు ఆమె ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌లో పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్‌లో దేశాధ్యక్షుడు హసన్ రౌహానీకి చాలా దగ్గరగా ఆమె కూర్చున్నారు. దీంతో రౌహానీ ఆరోగ్యంపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు ఇరాన్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం కరోనా సోకిన వారి సంఖ్య 245కు చేరుకుందని, వీరిలో 106 మంది ఒక్క రోజులోనే కరోనా వైరస్‌ బారిన పడినట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

చదవండి: ఎట్టకేలకు భారత్‌ చేరుకున్న జ్యోతి

మరిన్ని వార్తలు