‘భారత్‌ ముందుకొస్తే స్వాగతిస్తాం’!

8 Jan, 2020 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తలు రోజురోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చల కోసం భారత్‌ ప్రయత్నిస్తే స్వాగతిస్తామని  అలీ చెగేనీ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే దేశాలలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా  చర్చల కోసం భారత్‌ చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

బుధవారం ఢిల్లీలో ఇరాన్‌ ఎంబసీ నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న అలీ చెగేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. ఇరాన్‌ అమెరికాల మధ్య శాంతికి ఏ దేశం ప్రయత్నించినా స్వాగతిస్తామని, అలాగే భారత్‌-ఇరాన్‌ మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగా భారత్‌ మరింత చొరవ తీసుకోవాలని కోరారు. 

కాగా ఇరాన్‌ మిలటరీ జనరల్‌ ఖాసిమ్‌ సులేమానీని అమెరికా భద్రత బలగాలు అంతమొందిచిన సమయంలోనూ సంయమనం పాటించాలని భారత్‌ ఇరాన్‌ను కోరిన విషయం తెలిసిందే. ఇరాన్‌ అమెరికా మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయని, ప్రపంచ దేశాలన్ని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది అన్ని దేశాలకు హెచ్చరిక అని పేర్కొంది.

ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మిస్సైల్‌ దాడి చేసిన విషయం విదితమే. దీంతో ఇరుదేశాల మధ్య మరింత  ఉద్రిక్త పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి. ఈ దాడిలో 80 మందికి పైగా అమెరికా బలగాలు మరణించారని ఇరాన్‌ మీడియా ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా తన ఆర్మీ స్థావరాలన్నింటిలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు పెంటగాన్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అవసరమైన అన్ని రక్షణచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. దాడులు జరిగిన అనంతరం ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ మహ్మమద్‌ బగ్హేరి అమెరికాను హెచ్చరించారు. ఇరాన్‌ అమెరికాకు చాలా బలంగా సమాధానం చెబుతుందని, ఇరాన్‌కు చెడు చేయాలని ప్రయత్నిస్తే అదే రీతీలో అమెరికాకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు..

అమెరికా స్థావరాలపై ఇరాన్క్షిపణి దాడులు

నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ట్రంప్

ఇరాన్దాడి : భగ్గుమన్న చమురు

ట్రంప్‌–మోదీ ఫోన్సంభాషణ

52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్‌!

సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట

>
మరిన్ని వార్తలు