ఐసిస్‌ అధీనంలోని చివరి పట్టణం స్వాధీనం

18 Nov, 2017 04:43 IST|Sakshi

బగ్దాద్‌: సంకీర్ణ సేనలతో పాటు కుర్దిష్‌ దళాల దాడులతో దెబ్బతిన్న ఉగ్రసంస్థ ఐసిస్‌కు మరో షాక్‌ తగిలింది. దేశంలో ఐసిస్‌ అధీనంలో ఉన్న చివరి పట్టణమైన ‘రవా’ను శుక్రవారం ఇరాక్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. ‘భద్రతా బలగాలు రవాకు విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై ఇరాక్‌ జాతీయ జెండాను ఎగరవేశాయి’ అని సంయుక్త ఆపరేషన్స్‌ కమాండ్‌(జేఓసీ) జనరల్‌ అబ్దెలామీర్‌ యరల్లాహ్‌ ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, కుర్దిష్‌ దళాలు, రష్యా మద్దతు ఉన్న సిరియన్‌ సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఇప్పటివరకు ఐసిస్‌ 95 శాతం భూభాగాన్ని కోల్పోయింది.

మరిన్ని వార్తలు