పెళ్లికి నిరాకరించిందని ఘాతుకం

26 Mar, 2018 10:33 IST|Sakshi
బాధితురాలు

సాన్‌ ఆంటోనియో : తాము తీసుకొచ్చిన సంబంధాన్ని కాదన్నందుకు కూతురి ముఖంపై కాగుతున్న నూనె పోసి దాడి చేసిన సంఘటనలో తల్లిదండ్రులను అరెస్టు చేసినట్టు సాన్‌ ఆంటోనియో పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఇరాక్‌కు చెందిన ఒక కుటుంబం రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వచ్చి సౌత్‌ టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. వారు తమ 16 సంవత్సరాల కూతురు వివాహాన్ని ఒక మధ్యవయస్కుడితో నిశ్చయించారు. అందుకు గాను అతడి వద్ద నుంచి 20 వేల అమెరికన్‌ డాలర్ల సొమ్ము కూడా తీసుకున్నారు.

కానీ వారి కుమార్తె ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో కోపించిన తల్లిదండ్రులు బాలికను కొట్టి, ఆమె మీద వేడి వేడి నూనె పోశారు. తల్లిదండ్రుల చర్యలతో బయపడిన బాలిక ఇంటినుంచి పారిపోయింది. ఈ సంఘటన జనవరి 30న జరిగింది. ఇంటినుంచి పారిపోయిన ఆ బాలికను గుర్తించామని, ఆమెను తన ఐదుగురు తోబుట్టువులతో పాటు పిల్లల సంరక్షణ విభాగంలో ఉంచినట్లు పోలీసు అధికారి బెక్సార్‌ కౌంటి షేరిఫ్‌ జేవీయర్‌ సలజార్‌ వెల్లడించారు. బాలిక తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు