సెక్స్ కు ఆకర్షితులౌతున్న ఐరిష్ టీనేజర్లు..

4 Jan, 2016 17:57 IST|Sakshi
సెక్స్ కు ఆకర్షితులౌతున్న ఐరిష్ టీనేజర్లు..

ఐర్లాండ్ టీనేజర్లు ఇప్పుడు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఎనిమిది నుంచి 18 ఏళ్ళ వయసులోని పిల్లలపై చేసిన సర్వేలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నాయి. అక్కడ ధూమపానంతోపాటు తాగుడుకు అలవాటు పడిన పిల్లలకంటే చిన్న వయసులోనే సెక్స్ పట్ల ఆకర్షితులవుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు తేల్చి చెప్తున్నాయి.  

ఐర్లాండ్ లో తాజాగా 230 స్కూళ్ళలో 13,500 మంది విద్యార్థులపై హెల్గ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బయటపడ్డ విషయాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే తమకు సెక్స్ అనుభవాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులోనూ పేద, మధ్య తరగతి పిల్లలే సెక్స్ పట్ల అధిక ఆసక్తి చూపుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు సెక్స్ లో పాల్గొనేప్పుడు దాదాపు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు  చెప్పడం గమనార్హం. వీరంతా సెక్స్ సమయంలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా  15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసు పిల్లలను సెక్స్ గురించి  ప్రశ్నించినపుడు మాత్రం 27 శాతంమంది శృంగార అనుభవం పొందుతున్నట్లు తెలిసిందని, అంతకు ముందున్నకంటే రెండు మూడు శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలుస్తోంది.

అయితే 2010 లో స్కూలు పిల్లలపై చేసిన సర్వేల్లోని నిష్పత్తికంటే... తాజా లెక్కల్లో స్మోకింగ్, డ్రింకింగ్ బానిసల సంఖ్య తగ్గిందని హెల్త్ ప్రమోషన్ రీసెర్స్ సెంటర్ పరిశోధకులు అంటున్నారు. అయితే సెక్స్ అనుభవాలను పొందుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు వారు చెప్తున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 12 నుంచి 8 శాతానికి సిగరెట్లు, మద్యం సేవించే వారి సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన వల్లే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాక 2011  తో పోలిస్తే వారంతా డైటింగ్ పై కూడ శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే నేపథ్యంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని... స్వీట్లు, కూల్ డ్రిక్ ల వాడకం తగ్గిస్తున్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది.

మరిన్ని వార్తలు