ఇనుమును తినేస్తున్న రాయి.. వైరల్‌ వీడియో

18 May, 2018 17:34 IST|Sakshi

మయన్మార్‌ : ప్రపంచంలో కొన్ని ఘటనలు వినడానికి వింతగా ఉంటాయి. కొన్ని సార్లు వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టం. అవి ఎలాంటివి అంటే దేవుడి విగ్రహం ముందు పాలు పెడితే తగ్గడం, చెట్ల మొదళ్ల నుంచి పాలు కారడం, విగ్రహాల చుట్టూ జంతువులు చేరి పూజ చేయడం, మరికొన్ని చోట్ల వాటి కళ్ల నుండి నీరు, ఏదైనా ద్రవం రావడం వంటివి. అవి చిత్రంగా ఉంటూ అందరినీ ఆకర్శిస్తాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి మయన్మార్‌లో జరిగింది. సాధారణంగా ఇనుమును కరగ తీయడం కోసం నిప్పుల్లో ఉంచుతారు. కానీ మయన్మార్‌లో మాత్రం ఓ రాయి చిత్రంగా ఇనుముని తినేస్తోంది. రాయి ఇనుమును తినడం ఏంటి అనుకోకండి.. కానీ ఇది నిజం.

గోడకు కొట్టే మేకుని దానిపై ఉంచితే నిమిశాల్లో కరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆదేశ సైనికుడు కనిపెట్టాడు. ఇనుమును రాయి తినేస్తుందంటే ఎవరూ నమ్మలేదు. పైగా పిచ్చివాడిగా చూశారు. దీంతో మేకును రాయిపై ఉంచి వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోని 9 మిలియన్ల మంది చూశారు. ఈ రాయిని పరిశీలించిన శాష్త్రవేత్తలు, ఈ రాయి ఓ విలక్షణమైన లక్షణాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇనుమును కరిగించడానికి గల కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు