బందీగా ఉన్న జపనీయుడి హత్య!

25 Jan, 2015 04:15 IST|Sakshi
కాషాయ దుస్తులు ధరించిన ఇద్దరు జపనీయులు - మధ్యలో ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాది

 టోక్యో: ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇటీవల బందీలుగా పట్టుకున్న ఇద్దరు జపనీయులలో ఒకరిని హతమార్చినట్లు తాజాగా శనివారం ఓ వీడియోని విడుదల చేశారు. సిరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్  జపనీయులు  కెంజీ గోటో జోగో, హరునా యుకావాలను గత వారంలో బంధించిన విషయం తెలిసిందే.  వారిని విడుదల చేయడానికి మూడు రోజుల్లో 1236 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ వీడియో విడుదల చేశారు. గడువు ముగిసిన వారిని హతమారుస్తామని హెచ్చరించారు.

ఇంతకు ముందు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) తనకు బందీలుగా చిక్కిన వివిధ దేశస్థులను అతి కిరాతకంగా హత్యలు చేసి, ఆ దృశ్యాలను చిత్రీకరించిన వీడియోలను  అల్-ఫుర్ఖాన్ అనే  తమ వెబ్ సైట్లో  పెడుతుండేది. ఈసారి కూడా తనకు బందీలుగా చిక్కిన కెంజి గోటో జోగో, హరున యుకావలను ఒక ఎడారి ప్రాంతంలో మోకాలుపై కూర్చోబెట్టి వారిరువురి మధ్య నల్లదుస్తులు, మొహానికి నల్ల ముసుగు ధరించిన ఒక ఉగ్రవాది  హెచ్చరిక చేస్తూ ఉన్న దృశ్యాలను చిత్రీకరించిన వీడియోని వెబ్ సైట్లో ఉంచారు. ఉగ్రవాదం నిర్మూలించేందుకు జపాన్ ప్రభుత్వం విరాళాలు ప్రకటించడాన్ని వారు వ్యతిరేకించారు.

హరునా యుకావాను హతమార్చినట్లు ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులు శనివారం విడుదల చేసిన వీడియోని పరిశీలిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపిందని బీబీసీ పేర్కొంది. ఈ విషయం తెలిసిన వెంటనే జపాన్ మంత్రి మండలి అత్యవసరంగా సమావేశమైనట్లు కూడా బీబీసీ తెలిపింది.

>
మరిన్ని వార్తలు