‘మా జోలికొస్తే.. ఎవరినీ వదిలిపెట్టం’

28 Dec, 2017 15:18 IST|Sakshi

జెరూసలేం : ఇరాన్‌ దుందుడుకు చర్యలకు దిగితే.. ప్రతిఘటించేందుకు ఇజ్రాయల్‌ సిద్ధంగానే ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ ఫోర్స్‌ కలిగిన దేశాల్లో ఇజ్రాయిల్‌ ఒకటి ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని అయినా.. ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించగల సత్తా ఇజ్రాయిల్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు ఉందని ఆయన ఇరాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్టులు, దాడులు చేయడం, స్వీయరక్షనలో ఇజ్రాయిల్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు తిరుగులేని సామర్థ్యమందున్న విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాలని ఆయన అన్నారు.

ఇరాన్‌ సాయుధ దళాలు సిరియాలోని ఇజ్రాయీలీలపై దాడులుకు దిగితే.. పరిస్థితులు తీవ్రంగా మారతాయన్నారు. గతంలో కూడా సిరియాలో ఇరాన్‌ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.. ఇటువంటి ప్రయత్నాలను ఇజ్రాయిల్‌ ఏ మాత్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. గాజాలోని స్థానిక ప్రజలు శాంతియుత జీవనానికి ఇజ్రాయిల్‌ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. అయితే బయటి శక్తులు.. గాజా శాంతియుత జీవనంపై ప్రభావం చూపితే.. ఇజ్రాయిల్‌ సైనికచర్యతోనే సమాధానం చెబుతుందని నెతన్యాహూ పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు