స్వీయ నిర్బంధంలోకి ఇజ్రాయిల్‌ ప్రధాని..

30 Mar, 2020 18:41 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ఆయన కార్యాలయ అధికారులు వెల్లడించారు. నెతన్యాహు సహాయకుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్‌లో మహమ్మారి వైరస్‌ వేగంగా ప్రబలుతుండటంతో దేశమంతటా పూర్తిస్ధాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రజలను వారి ఇళ్ల నుంచి కనీసం 100 మీటర్లు మించి బయటకు అనుమతించడంలేదు. ఆహార పదార్ధాలను తెచ్చుకునేందుకే ప్రజలను అనుమతిస్తున్నారు. ఇప్పటివరకూ 4347 మంది ఇజ్రాయిల్‌ పౌరులు కరోనావైరస్‌ బారినపడగా, 134 మంది కోలుకున్నారు. 16 మంది కరోనాతో బాధపడుతూ మరణించగా, 95 మంది తీవ్ర అస్వస్ధతతో ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా ఓ ఇజ్రాయిలీ టూరిస్టు ఇటలీలో మరణించాడని తెలిపారు.

చదవండి : కరోనా బారిన పడి 14 ఏళ్ల బాలుడి మృతి

>
మరిన్ని వార్తలు