ఇస్రో ‘మామ్’ బృందానికి స్పేస్ పయనీర్ అవార్డు

15 Jan, 2015 03:07 IST|Sakshi
ఇస్రో ‘మామ్’ బృందానికి స్పేస్ పయనీర్ అవార్డు
  • తొలి ప్రయత్నంలోనే సాధించిన విజయానికి
  • నేషనల్ స్పేస్ సొసైటీ పురస్కారం ప్రకటన
  • వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంగారక గ్రహంపై పరిశోధనలకు ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) బృందాన్ని ప్రతిష్టాత్మక 2015 స్పేస్ పయనీర్ పురస్కారం వరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ బృందానికి డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురై నేతృత్వం వహిస్తున్నారు. అరుణగ్రహంపైకి ఉపగ్రహ ప్రయోగమనే అరుదైన విజయాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించినందుకుగాను ఇస్రో మామ్ బృందానికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నేషనల్ స్పేస్ సొసైటీ ఈ అవార్డును ప్రకటించింది.

    అమెరికాలోని టొరంటోలో ఈ ఏడాది మే 20 నుంచి 24వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష పురోగతి సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇస్రో 2013 నవంబర్ 5వ తేదీన మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగించగా.. ఈ ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24వ తేదీన్ అంగారక కక్ష్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగం రెండు తొలి విజయాలు సాధించిందని నేషనల్ స్పేస్ సొసైటీ పేర్కొంది.
     
    ఇస్రో చైర్మన్‌గా కిరణ్ కుమార్  బాధ్యతల స్వీకరణ

    బెంగళూరు: ఇస్రో నూతన చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త ఏ ఎస్ కిరణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్పేస్ కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కుమార్‌ను ప్రభుత్వం సోమవారం ఇస్రో చైర్మన్‌గా నియమించింది. కిరణ్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు.

మరిన్ని వార్తలు