‘అగస్టా’ కేసులో ఫిన్‌మెకానికా చీఫ్‌కు క్లీన్‌చిట్‌

9 Jan, 2018 02:56 IST|Sakshi

మిలన్‌:  అగస్టావెస్ట్‌లాండ్‌ కుంభకోణం కేసులో హెలికాప్టర్‌ తయారీ సంస్థ ఫిన్‌మెకానికా సంస్థ మాజీ సీఈఓను ఇటలీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంతో ఫిన్‌మెకానికా మాజీ సీఈవో గుసెప్పె ఒర్సికి సంబంధం లేదని ఇటలీ అప్పీల్‌ కోర్టు సోమవారం తేల్చింది.

ఫిన్‌మెకానికా సోదర సంస్థ అయిన అగస్టావెస్ట్‌లాండ్‌ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని నిర్దోషిగా పేర్కొంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత రక్షణ శాఖ, అగస్టా కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరిన సమయంలో (2010 ఫిబ్రవరిలో) ఒర్సి సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. తప్పుడు లెక్కలు చూపడంతోపాటు అవినీతికి పాల్పడ్డారనే కారణంతో 2014లో ఆయన్ను అరెస్టు చేశారు.    

మరిన్ని వార్తలు