బంగ్లాదేశ్ లో కాల్పుల కలకలం

18 Nov, 2015 13:04 IST|Sakshi
బంగ్లాదేశ్ లో కాల్పుల కలకలం

ఢాకా: బంగ్లాదేశ్లో పలు ప్రాంతాల్లో విదేశీయులపై దాడులు జరుగతున్నాయి. తాజాగా ఇటలీకి చెందిన ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తూర్పు బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఘటనలో ఇటలీకి చెందిన మతగురువు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ దాడులకు ఇస్లామిక్ స్టేట్ వారిని బాధ్యులను చేస్తున్నారని అక్కడి పోలీసులు పేర్కొంటున్నారు. ఇన్స్పెక్టర్ రోబియల్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటలీకి చెందిన మతగురువు పీరో బుధవారం ఉదయం దినాజ్పూర్ పట్టణంలో సైకిల్పై వెళ్తున్నాడు.

ఆ సమయంలో బైక్పై వచ్చిన గుర్తుతెలియని ఓ గన్మెన్ ఆ మత గురువుపై కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇటలీ వ్యక్తి కాథలిక్ సంస్థలో కొంత కాలం డాక్టర్గా పనిచేశాడని మరో మతగురువు అంధోని సెన్ తెలిపారు. అయితే, ముగ్గురు వ్యక్తులు చాలా సమీపం నుంచి డాక్టర్పై కాల్పులు జరిపారని చెప్పాడు. బాధితుడి పరిస్థితి కాస్త విషమంగా ఉందని, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు.

మరిన్ని వార్తలు