స్వలింగ వివాహలకు ఇటలీ ఆమోదం

12 May, 2016 10:30 IST|Sakshi

రోమ్: స్వలింగ సంపర్కుల వివాహాలకు ఇటాలియన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దేశ పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఓటు ద్వారా  బిల్లుపై బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై స్వలింగ సంపర్కులు ఇటలీలో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అందరిలాగే జీవితం గడపవచ్చు. చారిత్రాత్మక నిర్ణయంతో ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి.

'తమ ఆకాంక్షలు గుర్తించినందుకు ఈ రోజు చాలామంది వేడుకలు జరుపుకుంటారు' అని ఈ సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి  మట్టెయో రెంజీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. తమ భాగస్వామి లేనందున రాత్రుళ్లు నిద్రపట్టక ఒత్తిడి గురయ్యేవారికి ఇది మంచివార్త అని, వాళ్లంతా తాజా నిర్ణయంతో వేడుక చేసుకుంటారన్నారు. రెంజీ ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ కౌన్సిలర్గా పని చేసిన  అలెస్సియా బెల్లినీ ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా ప్రకటించిన బెల్లినీ క్యాన్సర్తో 2011లో మరణించింది.
 

మరిన్ని వార్తలు