కరోనా టీకా : త్వరలో మనుషులపై ప్రయోగం

6 May, 2020 13:05 IST|Sakshi

రోమ్ :  ప్ర‌పంచం మీద త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్న క‌రోనాపై వ్యాక్సిన్‌ను క‌నుగొనే విష‌యంలో ఇటలీ ముంద‌డుగు వేసింది. ప్ర‌పంచం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న టీకాను తాము అభివృద్ధి చేసిన‌ట్లు ఇట‌లీ పరిశోధకులు ప్ర‌క‌టించారు. మాన‌వుల‌పై ఈ వ్యాక్సిన్ ప‌నిచేస్తుంద‌ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని పేర్కొన్నారు. దీని ద్వారా ఉత్ప‌త్తి అయిన యాంటీబాడీస్ క‌రోనాపై పోరాడి అంతం చేస్తుంద‌ని వివ‌రించారు. రోమ్‌లోని స్ప‌ల్లంజానీ హాస్పిట‌ల్‌లో ఇప్ప‌టికే ఎలుక‌ల‌పై ఈ వ్యాక్సిన్ ప్ర‌యోగించామ‌ని తెలిపారు. ట‌కీస్ అనే సంస్థ జ‌రిపిన ఈ ప‌రిశోధ‌న‌ల్లో వ్యాక్సిన్ ఎలుక‌ల‌పై విజయవంతం అయిన‌ట్లు సీఈవో ఆరిసీచియో వెల్ల‌డించారు.

ఎలుకల్లో క‌రోనాను నిరోధించే యాంటీబాడీస్ ఉత్ప‌త్తి అయిన‌ట్లు క‌నుగొన్నామ‌ని తెలిపారు. వ్యాక్సిన్ త‌యారీలో ఇది కీల‌క ముంద‌డుగు అని, మాన‌వుల‌పై అతి త్వ‌ర‌లోనే ప్ర‌యోగాలు చేస్తామ‌ని వివ‌రించారు. అమెరిక‌న్ ఔష‌ధ సంస్థ‌తో క‌లిసి మ‌రిన్ని పరిశోధ‌న‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇక కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 2,53,974 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా రక్క‌సిని అంతమొందించేందుకు ప‌లు దేశాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్ త‌యారీలో ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాపై పోరాడ‌టానికి 70 వ్యాక్సిన్లు అభివృద్ధి చేయ‌గా, వాటిలో కేవ‌లం ఐదు మాత్ర‌మే మాన‌వుల‌పై ట్ర‌య‌ల్స్ కోసం అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయి.  (ఈ ఏడాది చివరికల్లా టీకా! )


.

మరిన్ని వార్తలు