తల్లిగా ఓడిపోకుండా చేశారు: ఇవాంక

7 Jan, 2020 14:49 IST|Sakshi

తల్లిగా తనని ఓడిపోకుండా చేశారంటూ అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాంక ఇటీవల తన తండ్రి, కుటుంబ సభ్యులతో కలిసి ‘ప్రెసిడెంట్‌స్‌ మార్‌-ఏ లాగో ఎస్టేట్‌’లో హాలిడే ఎంజాయ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి వస్తున్న క్రమంలో విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు.  ‘మేము సెలవు రోజులు ఎంజాయ్‌ చేయడానికి పర్యటనకు వెళ్లాము. ఆదివారం తిరిగి వాషింగ్టన్‌ చేరుకున్నాము. ఈ క్రమంలో వాషింగ్టన్‌లో విమానం ల్యాండ్‌ అవుతుండగానే నా చిన్న కుమారుడు థియోడోర్‌ జేమ్స్‌ ఉత్సాహంతో విమానం నుంచి ఒక్కసారిగా పరుగులు తీశాడు. దీంతో అక్కడే ఉన్న సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌.. జేమ్స్‌ను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ తల్లిగా వారు నన్ను ఓడిపోకుండా చేశారు’ అంటూ ఇవాంక ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.  

కాగా ఆ సమయంలో జేమ్స్‌ తన కూతురు చేతిని పట్టుకుని ఉండటంతో చేతిని విడిపించుకుని పరుగులు తీశాడని ఇవాంక పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ... ‘తల్లిగా నన్ను ఓడిపోకుండా చేసిన అమెరికా విమాన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌కు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌ జత చేశారు. అంతేగాకుండా తన కుమారుడి ఫొటోలను క్యాప్చర్‌ చేసిన ఫొటోగ్రాఫర్ల ప్రతిభను ప్రశంసించారు. ఇక ఈ ఫొటోలకు ఇప్పటి వరకు 1.3 లక్షల లైకులు రాగా ‘ థీయో ఎంత క్యూట్‌గా ఉన్నాడో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇవాంక- జారేద్‌ కుశ్నర్‌ దంపతులకు ముగ్గురు సంతానం(ఒక కూతురు, ఇద్దరు కుమారులు) ఉన్న సంగతి తెలిసిందే. వారి ఫొటోలను ఇవాంక తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు.

Theo busted attempting a stealth exit from AF1 last night while I was distracted prying melted M&Ms out of my daughter’s hands. Thanks to the US Secret Service I narrowly avoided a major parenting fail! 😅 Hat tip to the eagle eyed photographers who busted my boy in action!

A post shared by Ivanka Trump (@ivankatrump) on

Home: Imagination Station 🚘🔨☺️

A post shared by Ivanka Trump (@ivankatrump) on

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా