జైషే చీఫ్‌ ఆచూకీ లభ్యం..

18 Feb, 2020 11:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ ఆచూకీని భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. బహవల్పూర్‌ జైషే ప్రధాన కేంద్రం వెనుక బాంబ్‌ ప్రూఫ్‌ నివాసంలో మసూద్‌ అజర్‌ బస చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి మసూద్‌ అజర్‌ భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. మసూద్‌కు సంబంధించిన కౌసర్‌ కాలనీ బహవల్పూర్‌, మదర్సా బిలాల్‌ హడబ్షి పతున్‌క్వా, మరర్సా లక్కి మర్వత్‌ బహవల్పూర్‌ అనే మూడు చిరునామాలనూ నిఘా సంస్థలు కనుగొన్నాయి. జైషే చీఫ్‌ అదృశ్యమయ్యాడని పాకిస్తాన్‌ పేర్కొంటున్న క్రమలో మసూద్‌ అజర్‌ కదలికలపై నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముంబై ఉగ్రదాడిలో ప్రమేయమున్న లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్తాన్‌ మసూద్‌ అజర్‌పై  మాత్రం భారత్‌ పలు ఆధారాలు చూపినా నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. 

చదవండి : జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు ఏమైంది.?

మరిన్ని వార్తలు