సూట్‌కేసుల్లో ఖషొగ్గీ శరీర భాగాలు!

1 Jan, 2019 08:55 IST|Sakshi
సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు

అంకారా : సౌదీ అరేబియా జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారనే వాదనలకు బలం చేకూరుతోంది. ఖషోగ్గీ శరీర భాగాలను కొందరు వ్యక్తులు సూట్‌కేసులు, బ్యాగుల్లో తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు 5 సూట్‌ కేసులు, 2 పెద్ద సంచులను ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌ జనరల్‌ ఇంట్లోకి తీసుకెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ఫుటేజీని ఎ–హబేర్‌ అనే టర్కీ టీవీ చానల్‌ ఆదివారం ప్రసారం చేసింది. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సౌదీ కాన్సులేట్‌లోనే 2018 అక్టోబర్‌లో ఖషొగ్గీ(59) హత్యకు గురైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆ బ్యాగులు, సూట్‌ కేసుల్లోనే తరలించారని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ చానల్‌ పేర్కొంది. అయితే, అప్పట్లో ఖషొగ్గీ శరీర భాగాలను యాసిడ్‌లో వేసి ఆనవాళ్లు దొరక్కుండా చేశారని అనుమానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?)


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు