భూ ప్రకంపనలు: సునామీ హెచ్చరికలు

18 Jun, 2019 20:10 IST|Sakshi

టోక్యో: జపాన్‌లో సంభవించిన భూకంప ప్రకంపనలు ఆ దేశ  ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తూర్పు జపాన్‌ ప్రాంతంలో 6.5 తీవ్రతతో సోమవారం భూకంపం సంభవించినట్టు ఆ దేశ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. దీంతో ముందస్తుగా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల జరిగిన నష్టం, గాయపడిన వారి సమాచారం తెలియరాలేదు. కాగా మియాజి ప్రాంతంలో 1.6 అడుగుల మేర అలలతో కూడిన సునామీ వచ్చినప్పుట్లు జపాన్ మెటరలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

అయితే హవాయి, అమెరికా పశ్చిమ తీరంలో సునామీకి సంబంధించిన ఎలాంటి జాడలు లేవని అమెరికా, ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. జపాన్‌లో స్థానికి కాలమానం ప్రకారం సోమవారం 7.23 కి హోన్స్ తూర్పు తీర ప్రాంతాల్లో భూప్రకంపనాలు చోటుచేసుకున్నట్లు, 5.9 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా 2011 మార్చి 11న జపాన్ ఈశాన్య తీరంలో 9తీవ్రతతో సంభవించిన తీవ్రమైన విపత్తు సుమారు 18,000 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు