జపాన్‌ దూకుడు.. మరో రియాక్టర్‌ రీస్టార్ట్‌

6 Jun, 2017 16:38 IST|Sakshi
జపాన్‌ దూకుడు.. మరో రియాక్టర్‌ రీస్టార్ట్‌

టోక్యో: జపాన్‌ ఎట్టకేలకు మరో అణువిద్యుత్‌ ఫ్లాంటును పునఃప్రారంభించింది. 2011 ఫుకుషిమా ప్రమాదం తర్వాత మూతబడిన అణుప్లాంటుల్లోని 3వ రియాక్టర్‌కు మంగళవారం స్విచ్చాన్‌ చేసింది. తఖాహామాలోని న్యూక్లియర్‌ ప్లాంటులో ఈ రియాక్టర్‌ ఉంది. తాజా రియాక్టర్‌ను ప్రారంభించడంతో ప్రస్తుతం జపాన్‌లో పనిచేస్తున్న అణు రియాక్టర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయినప్పటికీ ఇంకా తెరుచుకోవాల్సిన అణు రియాక్టర్లు చాలానే ఉన్నాయి. మార్చి 2011లో భారీ భూకంపం వచ్చిన తర్వాత ఏర్పడిన సునామీ కారణంగా ఫుకుషిమా అణు ప్లాంటులోకి భారీ మొత్తంలో వరద రావడంతో పేలుడు చోటు చేసుకొని పెద్ద మొత్తం రేడియో ధార్మికత విడుదలైన విషయం తెలిసిందే.

దీంతో అక్కడి వారంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లగా పలువురు ప్లాంటును వ్యతిరేకిస్తూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అణు ప్లాంటులన్నింటినీ మూసి వేయాలని కోర్టు ఆదేశించడంతో అన్నీ మూతపడ్డాయి. ఇటీవలె పూర్తిస్థాయిలో రక్షణ పరమైన చర్యలు తీసుకున్నట్లు కోర్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల తఖాహామాలోని 4వ రియాక్టర్‌కు అనుమతివ్వగా తాజాగా 3వ రియాక్టర్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో దానిని కూడా ప్రారంభించింది. ఈ అణుప్లాంటును కాన్సాయి ఎలిక్ట్రిక్‌ పవర్‌(కేఈపీసీవో) అనే సంస్థ నడుపుతోంది.

మరిన్ని వార్తలు