'శాటిలైట్' ను పేల్చేస్తాం

3 Feb, 2016 13:43 IST|Sakshi
శాటిలైట్ క్షపణికి కూల్చివేసేందుకు విధ్వంసక వాహనాలను సిద్ధం చేస్తోన్న జపాన్ సైన్యం

హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో తూర్పు ఆసియాపై ఆవహించిన యుద్ధమేఘాలకు ఇంకాస్త కారునలుపును పులుముతోంది ఉత్తర కొరియా. తాజాగా ఆ దేశం తలపెట్టనున్న క్షిపణి ప్రయోగాన్ని పొరుగేశం జపాన్ వ్యతిరేకించడమేకాక తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేసింది.

అణ్వాయుధాలను మోసుకెళ్లనడమే కాక దాదాపు 3,400 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగల ఖండాంతర క్షిపణిని ఇటీవలే అభివృద్ధి చేసిన ఉత్తర కొరియా.. ఈ నెలలోనే దానిని పరీక్షించాలని భావిస్తున్నది. కొరియా నియంత నేత ప్యోగ్ యాంగ్.. 'శాటిలైట్' గా నామకరణం చేసిన ఆ క్షపణి పరీక్షకు ఫిబ్రవరి 8న అధికారిక కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

'శాటిలైట్ క్షిపణి గనుక మా గగనతలంలోకి ప్రవేశిస్తే దాన్ని పేల్చిపారేస్తాం'అని ఉత్తరకొరియాను హెచ్చరించింది. 'శిటిలైత్ మన పరిధిలోకిగానీ వస్తే తునాతునకలుచేయండిట' అంటూ జపాన్ రక్షణశాఖ మంత్రి జనరల్ నకతాని సైన్యానికి ఆదేశాలు జరీచేశారు. ఇప్పటికే ఉత్తరకొరియా సరిహద్దు వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించిన జపాన్ తమదగ్గరున్న పీఏసీ- 3, ఎస్ఎం-3 క్షిపణి విధ్వంసక వ్యవస్థతో శాటిలైట్ ను కూల్చేస్తామని తెలిపింది. అత్యవసరంగ జారీచేసిన ఆదేశాలు ఫిబ్రవరి 25 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు