లాక్‌డౌన్ మే 31 వ‌ర‌కు.. త్వ‌ర‌లో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌

4 May, 2020 13:22 IST|Sakshi

టోక్యో : క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా జ‌పాన్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా  అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మే31 వ‌ర‌కు పొడిగించే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. దీనికి సంబంధించి సోమ‌వారం జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే వివిధ నిపుణుల బృందంతో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. లాక్‌డౌన్ పొడిగింపుకే ప్ర‌ధాని మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. సాయంత్రానిక‌ల్లా దీనిపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలో 15,589 మందికి క‌రోనా వైర‌స్ సోక‌గా, 530 మ‌ర‌ణించారు.  (పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం )

కోవిడ్ నివార‌ణ‌కు నెల‌రోజుల పాటు నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఏప్రిల్‌7 న ప్ర‌ధాని షింజో అబే ప్ర‌క‌టించారు. మే 7న ఈ గ‌డువు ముగుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాన్న‌దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అయితే లాక్‌డౌన్ పొడిగింపుకే ప్రధాని మొగ్గుచూపుతున్న‌ట్లు ప్రాథ‌మికంగా అందుతున్న స‌మాచారం. క‌రోనా వ్యాప్తి త‌గ్గితే త్వ‌ర‌లోనే పార్కులు, మ్యూజియం వంటి ప్రాంతాలను తెరిగి తెర‌వ‌డానికి అనుమ‌తిస్తామ‌ని జ‌పాన్ ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు. దీని ద్వారా ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ఏర్ప‌డిన అడ్డంకుల‌ను కొంత వ‌ర‌కు త‌గ్గించ‌వచ్చ‌ని పేర్కొన్నారు. (వీడియో షేర్‌ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్‌! )

మరిన్ని వార్తలు