జపాన్ ఆర్థిక వ్యవస్థకు కరోనా షాక్

18 May, 2020 20:54 IST|Sakshi

నాలుగున్నరేళ్ళ తరువాత తొలిసారి మాంద్యంలోకి

తగ్గిన వినియోగం, కుప్పకూలిన ఎగుమతులు

యుద్దానంతర సంక్షోభంలోకి ఆర్థికవ్యవస్థ

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కల్లోలానికి జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్ప‌కూలింది.  గత నాలుగున్న సంవత్సరాల కాలంలో  మొదటిసారిగా మాంద్యంలోకి పడిపోయింది.  సోమవారం వెల్లడించిన   జీడీపీ  డేటా ప్రకారం ,వరుసగా రెండవ త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ కుంచించుకుపోయింది. కరోనా వైరస్ సంక్షోభంతో వ్యాపారాలు కుదేలవ్వడంతో యుద్ధానంతర తిరోగమనానికి  చేరుకుందని విశ్లేషకులు తెలిపారు.

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో మూడ‌వ అతిపెద్దదైన జ‌పాన్‌ ఈ ఏడాది మొద‌టి మూడు నెల‌ల్లో దారుణంగా దెబ్బతింది.   ప్రైవేటు వినియోగం, మూలధన ప్రాథమిక ,ఎగుమతులు పడిపోవడంతో గ‌త ఏడాదితో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ 3.4 శాతం కుప్ప‌కూలింది.  2015 త‌ర్వాత ఇదే అతిపెద్ద పతనమని భావిస్తున్నారు.  వాస్త‌వానికి జపాన్ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌లేదు. కానీ ఏప్రిల్‌లో ఎమ‌ర్జెన్సీ అమ‌లు చేయడంతో అక్క‌డ వ్యాపారాలు నిలిచిపోయాయి.  దీంతో జీడీపీలో ఈ ఏడాది తొలి మూడు నెల‌ల్లో 3.4 శాతం న‌ష్టంతో పాటు గ‌త ఏడాది చివ‌రి క్వార్ట‌ర్‌లో 6.4 శాతం న‌ష్టం వ‌ల్ల సాంకేతికంగా జ‌పాన్ సంక్షోభంలోకి  జారుకుంది.   (వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు - కిరణ్‌ మజుందార్‌ షా)

ప్రస్తుత త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత  క్షీణించిందని మీజీ యసుడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎకనామిస్ట్ యుయిచి కోడామా అన్నారు. దీంతో జపాన్ పూర్తిస్థాయి మాంద్యంలోకి ప్రవేశించిందని విశ్లేషించారు.   ముఖ్యంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా ఉన్న ప్రైవేట్ వినియోగం 0.7శాతం పడిపోయింది. ఆర్థికవేత్తలు 1.6 శాతంగా వుంటుందని భావించారు. నాల్గవ త్రైమాసికంలో 1.5 శాతంగా అంచనాలతో పోలిస్తే మూలధనం గణనీయంగా 0.5 శాతానికి పడిపోయింది. కార్పొరేట్ జపాన్‌పై వైరస్ ప్రభావం  చూపింది. కార్లతో సహా వివిధ ఉత్పత్తుల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 6 శాతం తగ్గాయి. ఇవన్నీ కార్మిక మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చాయి. మార్చిలో నిరుద్యోగిత రేటు సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకోగా, ఉద్యోగ లభ్యత మూడేళ్ల కన్నా తక్కువ స్థాయికి పడిపోయింది. (శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..)

మరిన్ని వార్తలు