దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ జపాన్‌

31 Mar, 2018 19:06 IST|Sakshi

టోక్యో : దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ జపాన్‌.. పలు దేశాల నుంచి  తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఏకంగా 300 నీలి తిమింగలాను వేటాడి, అతిక్రూరంగా చంపింది. అంటార్కిటిక్‌ మహాసముద్రంలో ఈ ఆపరేషన్‌ను నిర్వహించగా.. ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం జపాన్‌ ప్రకటించుకుంది.

తిమింగలాలపై పరిశోధనల పేరిట గత నవంబర్‌లో మొత్తం ఐదు నావలు దక్షిణమహా సముద్రం నుంచి బయలుదేరాయి. అయితే అది వెళ్లింది పరిశోధనకు కాదని.. వారికి హతమార్చేందుకని ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సమయంలో పలు దేశాలు జపాన్‌  చేష్టలను తీవ్రంగా ఖండించాయి. మొత్తం 333 తిమింగలాలను హతమార్చి వాటి మృతదేహాలను నావల్లో వేసుకుని వచ్చాయి. శనివారం ఉదయం పశ్చిమ జపాన్‌లోని షిమోనోసెకి పోర్ట్‌కు చేరుకున్నాయి.

అయితే తిమింగలాల ప్రవర్తన, జీవశాస్త్రీయ అధ్యయనం కోసమే ఈ ఆపరేషన్‌ చేపట్టామని జపాన్‌ ప్రభుత్వం తమ చేష్టలను సమర్థించుకుంటుండగా.. తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమైపోయింది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్‌ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతీయేటా జరిగే తంతేనని కొట్టిపారేసేవాళ్లు లేకపోలేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు