జీ7 సదస్సుకు జపాన్‌ అధ్యక్షత, కారణం!

10 Jun, 2020 19:23 IST|Sakshi

టోక్యో: జీ-7 సదస్సుకు జపాన్‌ అధ్యక్షత వహిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి షింజోఅబే బుధవారం ఒక ప్రకటనలో  తెలిపారు. చైనా నూతన భద్రత చట్టానికి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో జీ-7 సదస్సును తమ దేశంలో జరపాలని భావిస్తున్నట్లు షింజో అబే తెలిపారు. హాంక్‌కాంగ్‌కు సంబంధించిన ఒకదేశం, రెండు విధానాలను కాపాడటానికి జీ-7కు చెందిన ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. చైనా జాతీయ గీతాన్ని ఆ గౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ హాంకాంగ్‌ పార్లమెంట్‌ బిల్లు పాస్‌ చేయడంతో నిరసనలు తారస్థాయిని చేరుకున్నాయి. గత ఏడాది నుంచి చైనా అధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక దేశం రెండు విధానాల విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం వల్లే ఈ అల్లర్లు జరుగుతన్నాయని చైనా వాదిస్తోంది.  (చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు)

మరిన్ని వార్తలు