అదృశ్య రైలు..

8 Apr, 2016 03:35 IST|Sakshi
అదృశ్య రైలు..

జపాన్ వాళ్లు ఏం చేసినా విచిత్రంగానే చేస్తారు. తాజాగా వాళ్లు ఓ 'కనపడని రైలు'ను తయారుచేశారు. ఈ రైలు బోగీలన్నింటికీ ఒక సెమీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేశారు. దాంతో అది దాదాపు వస్తున్నట్లే కనిపించదు. సెయిబు గ్రూపు కోసం జపాన్ ఆర్కిటెక్టు కజుయో సెజిమా ఈ కొత్త రకం రైలును రూపొందించారు. కంపెనీ వందో వార్షికోత్సవం సందర్భంగా దీన్ని తయారుచేశారు.

దాదాపుగా లివింగ్ రూమ్‌లా ఉండే సౌకర్యాలతో ఒక డిజైన్ కావాలని సెజిమాను ఆ గ్రూపు కోరింది. దాంతో ఈ సరికొత్త డిజైన్‌ను ఆయన తయారుచేయగా, పరిమిత సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రూటు రైళ్లకు దీన్ని అందించారు. 2018 నుంచి ఈ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడతాయని అంటున్నారు. సెయిబు గ్రూపునకు చెందిన రైల్వే విభాగం టోక్యో, సైతమా ప్రాంతాల్లో 180 కిలోమీటర్ల రైలు మార్గాలను నిర్వహిస్తుంది.

మరిన్ని వార్తలు