1,140 అడుగుల చెక్క ఆకాశహర్మ్యం..!

17 Feb, 2018 17:24 IST|Sakshi
టోక్యోలో నిర్మించనున్న చెక్క ఆకాశహార్మ్యం ఊహాచిత్రం

టోక్యో, జపాన్‌ : ప్రపంచంలో అతిపెద్ద చెక్క ఆకాశహర్మ్యాన్ని నిర్మించనున్నట్లు జపనీస్‌ ఆర్కిటెక్ట్స్‌ పేర్కొన్నారు. 1,148 అడుగులు(350 మీటర్లు) ఎత్తు ఉండే చెక్క భవనంలో షాపులు, ఇళ్లు, కార్యాలయాలు, హోటల్స్‌ ఉంటాయని చెప్పారు.

నగరాన్ని అడవిగా మార్చే యుద్ధప్రాతిపదిక చర్యల్లో భాగంగా సెంట్రల్‌ టోక్యోలో దీన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రతి భవనాన్ని ఎకో ఫ్రెండ్లీగా నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2041 కల్లా చెక్క ఆకాశహార్మ్యాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.

భవంతి నిర్మాణంలో 90 శాతానికి పైగా చెక్కనే వినియోగించనున్నట్లు వివరించారు. నిర్మాణానికి దాదాపు 5.9 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును డబ్ల్యూ 350గా పిలుస్తున్నారు. 70 అంతస్తులు ఉండే భవంతి నిర్మాణానికి ఏ రకపు చెక్కను వినియోగిస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు