బార్బీ బొమ్మకు బ్రదర్‌వా..!

17 Feb, 2019 03:32 IST|Sakshi

అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. అమ్మాయిలైతే ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అబ్బాయిలు కూడా ఏమీ తగ్గట్లేదు. అమ్మాయిలేమో కుందనపు బొమ్మలా.. బార్బీ డాల్‌లాగా తయారయ్యేందుకు తెగ ముచ్చట పడతారు. మరి అబ్బాయిలు..! మేం కూడా ‘బొమ్మ’లా తయారవుతానని అనుకున్నాడేమో ఈ ఫొటోలోని అబ్బాయి. రెండేళ్ల నుంచి ఏకంగా అచ్చు బొమ్మలాగే తయారవుతున్నాడు. జపాన్‌కు చెందిన మట్‌ కువాటాకు 24 ఏళ్లు. అందంగా తయారు కావడం ఇతడికి ఇష్టం. అందంగా కనిపించడమే కాదు.. వినూత్నంగా.. విభిన్నంగా కనిపించడం అంటే మనోడికి పిచ్చి క్రేజ్‌. 

అందుకు తగ్గట్టుగానే అచ్చు బొమ్మలా మారిపోతున్నాడు. ఇందుకోసం గంటలు గంటలు మేకప్‌ వేయించుకుంటున్నాడు. ఇలా తయారై తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేస్తుంటాడు కువాటా. ఇంకేం మనోడికి లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అయితే అలా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్నాడని కొందరు.. ఫొటోను ఎడిటింగ్‌ చేయడం వల్లే ఇలా కనిపిస్తున్నాడని మరికొందరు ఇన్‌స్ట్రాగాంలో విమర్శలు చేస్తున్నారు. అయితే వీటిని కువాటా కొట్టిపారేస్తున్నాడు. మేకప్‌ కనుక నిజమే అయితే ఆ మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రపంచంలోనే గొప్ప వాడవుతాడంటూ కొందరు కితాబిస్తున్నారు.

మరిన్ని వార్తలు