ఫోర్బ్స్‌ జాబితా: ప్రపంచ కుబేరుడు ఈయనే

6 Mar, 2018 19:38 IST|Sakshi

ప్రపంచంలో అతి సంపన్నులైన  వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ వెల్లడించింది.  2018 ఫోర్బ్స్‌ ప్రపంచ  బిలియనీర్ల  జాబితాలో అందరూ ఊహించినట్టుగా మైక్రోసాప్ట్‌ సహ-వ్యవస్థాపకుడు  బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి అమెజాన్‌ వ్యవస్థాపకుడు ,సీఈవో జెఫ్‌ బెజోస్‌  తొలిసారి ప్రథమస్థానానికి దూసుకు వచ్చారు.   బెజోస్‌ సంపదను 112 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్‌ అంచనా వేసింది. దీంతో  ఈ భూభాగంపై అపరకుబేరుడిగా ఆయన నిలిచారు. బెజోస్‌ జీవితంలో  గత ఏడాది  అతికీలకమైందని ఫోర్బ్స్‌ అసిస్టెంట్‌ ఎండీ లూయిసా క్రోల్‌ వ్యాఖ్యానించారు..  ప్రపంచ బిలియనీర్లను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి బెజోస్ అతి పెద్ద  విజయం సాధించిన సంవత్సరమిదని పేర్నొన్నారు.  ఈ 12 నెలల కాలంలో ఆయన 39 బిలియన్ల డార్లకుపైగా ఆర్జించినట్టు తెలిపారు.

బిల్ గేట్స్  90 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఇక​ ఈ జాబితాలో   84 బిలియన్ డాలర్లతో బిలియన్ డాలర్లతో అమెరికన్ వ్యాపార దిగ్గజం వారెన్‌ బఫెట్‌ మూడవ స్థానాన్నిసాధించగా , సోషల్‌ మీడియా దిగ్గజం  ఫేస్‌బుక్‌ అధిపతి  మార్క్‌జుకర్‌బర్గ్‌  71 బిలియన్ల డాలర్ల సంపదతో  అయిదవ స్థానంలో నిలిచారు.   అయితే ధనికులు, పేదల మధ్య అంతరం మరింత విస్తరించినట్టు ఫోర్బ్స్‌ తేల్చింది.   ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,200 మంది బిలియనీర్లు. 9.1 ట్రిలియన్ డాలర్ల విలువైన నికర విలువను కలిగి ఉన్నారని నివేదించింది.

2018  ఫోర్బ్స్‌ లిస్ట్‌ టాప్-15 
జెఫ్ బెజోస్
బిల్ గేట్స్
వారెన్ బఫ్ఫెట్
బెర్నార్డ్ ఆర్నాల్ట్  అండ్‌ ఫ్యామిలీ
మార్క్ జుకర్‌బర్గ్‌
అమంగియో ఒర్టెగా
కార్లోస్ స్లిమ్ హెల్ అండ్‌ ఫ్యామిలీ
చార్లెస్ కోచ్
డేవిడ్ కోచ్
లారీ ఎల్లిసన్
మైఖేల్ బ్లూమ్బెర్గ్
లారీ పేజ్
సర్జీ బ్రిన్
జిమ్ వాల్టన్
ఎస్‌. రాబ్సన్ వాల్టన్

మరిన్ని వార్తలు