కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు

23 May, 2020 20:59 IST|Sakshi

కరోనా కాలంలో  ఎగిసిన బిలియనీర్ల సంపద

మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ కు భారీ లాభాలు

వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  ఈ కాలంలో కూడా  అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు భారీ సంపదను ఆర్జించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ సీఈవో  జెఫ్ బెజోస్  భారీ లాభాలను సాధించారు. అమెరికాలో పలు సంస్థల తీవ్ర నష్టాలు, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో వీరి సంపద 45 శాతం ఎగియడం గమనార్హం. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) (2026 నాటికి జెఫ్‌ బెజోస్‌, మరి ముకేశ్‌ అంబానీ?)

రెండు నెలల కరోనా వైరస్  కాలంలో టెక్నాలజీ స్టాక్స్  లాభాల్లో దూసుకుపోవడంతో  వీరు మరింత  ధనవంతులయ్యారు. బెజోస్ సంపద 30 శాతం పెరిగి 147.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, జుకర్‌బర్గ్ సంపద 45 శాతం పెరిగి 80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా  ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో క్లౌడ్ బిజినెస్, వీడియో కాన్ఫరెన్స్ , గేమింగ్ వ్యాపారం పుంజుకోవడం, కొత్త ప్రోగ్రామ్ ప్రకటనలతో అమెజాన్, ఫేస్‌బుక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. (మోసగాళ్లకు చెక్ : మెసెంజర్‌లో కొత్త ఫీచర్)

తాజాపరిశోధనల ప్రకారం ఈ కాలంలో అమెరికాలోని  600 మంది బిలియనీర్లు టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో మరింత ధనవంతులయ్యారు.ఈ బిలియనీర్ల మొత్తం నికర విలువ మార్చి18- మే19 మధ్యకాలంలో 434 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 32.97 లక్షల కోట్లు) పెరిగింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్  బెర్క్‌షైర్ హాత్వే వారెన్ బఫెట్ స్వల్ప లాభాలకు పరిమితమయ్యారు. వీరు వరుసగా 8.2 శాతం, 0.8 శాతం లాభాలను నమోదు చేయగలిగారు. టాక్స్ ఫెయిర్‌నెస్ ,  ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థలు ఈ విశ్లేషణ చేశాయి.  (కరోనా : ఉద్యోగులను తొలగిస్తున్న టెక్‌ దిగ్గజం)

మరిన్ని వార్తలు