నీలగిరి చెట్ల నుంచి జెట్ ఇంధనం!

20 Sep, 2016 02:41 IST|Sakshi
నీలగిరి చెట్ల నుంచి జెట్ ఇంధనం!

మెల్‌బోర్న్: తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే జెట్ విమానాల ఇంధనాన్ని యూకలిప్టస్(నీలగిరి) చెట్లను ఉపయోగించి తయారు చేయొచ్చని  తేలింది. ‘ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూకలిప్టస్(జామాయిల్)చెట్లను పెంచినట్లయితే విమానయాన పరిశ్రమకు కావాల్సిన 5 % ఇంధనాన్ని వాటి నుంచి తయారు చేయొచ్చు’ అని ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీకి చెందిన కార్‌స్టెన్ కుల్హీమ్ పేర్కొన్నారు. మొత్తం ఈ పరిశ్రమ ద్వారా 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది. శిలాజ ఇంధనాలతో పోల్చితే యూకలిప్టస్ ఇంధనం ఖరీదైందని, కాకపోతే వీటివల్ల కార్బన్‌డై ఆక్సైడ్ తక్కువగా విడుదలవుతుందన్నారు.

జెట్ విమానాలకు శిలాజేతర ఇంధనాలు వాడడం కాస్త కష్టమని, అయితే పునరుత్పాదక ఇథనాల్, బయోడీజిల్ కొంతమేరకు ఫర్వాలేదని చెప్పారు. యూకలిప్టస్ నూనెలో మోనోటర్పీన్లు ఉంటాయని, వాటిని అధిక శక్తినిచ్చే ఇంధనాలుగా మార్చొచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు