పిల్లులంటే ఇష్టమా?.. అయితే ఈ వార్త చదవాల్సిందే!

12 Aug, 2018 16:31 IST|Sakshi
జోన్‌ బోవెల్‌

వీలైతే ప్రేమించండి... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమించడానికి మనుషులే అవసరం లేదు. కొందరు జంతువుల్ని కూడా ప్రేమిస్తారు. జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే జంతు ప్రేమికులకు ఓ శుభవార్త.. అందులోనూ పిల్లులను ఇష్టపడే వ్యక్తులకు మరింత పనికొచ్చే వార్త. 

జోన్‌ బోవెల్‌ 2010 నుంచి పిల్లుల్ని పెంచుతూ ఉంది. డెన్మార్క్‌కు చెందిన ఈమె ఓ యాభై పిల్లుల్ని పెంచుతూ తన ఇంటినే సాంక్చుయరీలా మార్చేసింది. అయితే తన ఆరోగ్యరిత్యా వేరేచోటుకు మారాల్సివచ్చింది. అయితే తను లేకపోతే సాంక్చుయరీ ఏమైపోతుందో అని బాధపడుతూ.. ఆ పిల్లుల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలంటూ.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. 

‘ఎవరికైనా పిల్లులంటే ఇష్టముంటే, జంతు ప్రేమికులైతే.. మమల్ని సంపద్రించండి. ఇది సరదా కోసం చేసింది కాదు. మా సాంక్చుయరీని రక్షిస్తూ.. ఇక్కడ ఉండే పిల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి గానూ ఉండడానికి ఇళ్లు, జీతం ఇస్తామం’టూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. అయితే దీనికి గాను కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. వయసు 45 ఏళ్లకు పైబడి ఉంటే బాగుంటుందని, మొదటి ఆరు నెలలు వాలంటీర్‌గా పనిచేయాలని తెలిపారు. ఆసక్తి గలవారు joanbowell@yahoo.com ఈ అడ్రస్‌కు అప్లికేషన్‌తో పాటు ఫోటోను జతచేసి పంపాలని పేర్కొన్నారు. వచ్చిన అప్లికేషన్స్‌లో నచ్చిన వాటిని తీసుకుని ఆగస్టు చివరికల్లా స్కైప్‌లో కాల్‌ చేసి మాట్లాడతామని తెలిపారు. 

మరిన్ని వార్తలు