భారత్‌-చైనా వివాదం సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధికారి

11 Jul, 2020 21:09 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ ఈ విషయం చెప్పారు.(గల్వాన్‌ దాడి; విస్తుగొలిపే నిజాలు!)

చైనా తన అన్ని సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్నదని ఈ కారణంగా.. జపాన్, ఇండియా, ఇతర దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని అన్నారు బోల్టన్‌. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్‌, భారత్ వైపు నిలుస్తాడనేది అనుమానమే అని తెలిపారు. నవంబర్ ఎన్నికల తరువాత ట్రంప్ ఇంకా ఏం చేస్తారో చెప్పలేమన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి కొనసాగించినా ఆశ్చర్యపోవద్దని సూచించారు. రాబోయే కొద్ది నెలల్లో ట్రంప్ ఇలాంటి అన్ని విషయాల నుంచి పక్కకు తప్పింకుంటారన్నారు. ఈ సారి తనను ఎన్నుకోవడం కష్టమని తెలిసినందున ట్రంప్‌ సరిహద్దులో శాంతినే కోరుకుంటారని బోల్టన్ పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలనలో 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ సేవలందించారు.

మరిన్ని వార్తలు