ప్రాణాలు కాపాడుకునేందుకు...

29 Oct, 2017 01:16 IST|Sakshi

కష్టాలు ఎదురైనప్పుడే మనలోని శక్తిసామర్థ్యాలు బయటకొస్తాయనే విషయాన్ని పెద్దలు చెబుతారు. జాన్‌ క్రెయిగ్‌ విషయంలోనూ అదే జరిగింది. అసలు సంగతేంటంటే... ఆస్ట్రేలియా కు చెందిన డ్రైవర్‌ ఓ చిన్న బోటును తీసుకొని సముద్రంలోకి వెళ్లాడు. అలా కొంతదూరం వెళ్లాక ఆ బోటు ఆగిపోయింది. అసలేం జరిగిందో చూద్దామని తలను నీళ్లలో ముంచి బోటు అడుగు భాగాన్ని పరిశీలిస్తున్నాడు.

అంతలోనే దాదాపు 13 అడుగులున్న ఓ షార్క్‌ తనవైపు రావడాన్ని జాన్‌ గమనించాడు. అక్కడే ఉంటే దానికి బ్రేక్‌ఫాస్ట్‌ అయిపోవడం ఖాయమనుకున్నాడు. వెంటనే నీళ్లలోకి దూకి.. స్విమ్‌ చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూస్తే షార్క్‌ తనను వెంబడించడాన్ని గమనించాడు. దీంతో మరింత వేగంగా స్విమ్‌ చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు.

అలా దాదాపు నాలుగు నాటికల్‌ మైళ్లు ఈదుకుంటూ వెళ్లిపోయాడు. హమ్మయ్య.. ప్రాణాలతో బయటపడ్డాననుకొని ఊపిరి పీల్చుకునేలోపే షార్క్‌ అతనికి నాలుగైదడుగుల దూరంలో దర్శనమిచ్చింది. ఇక అదే తన చివరిరోజు అనుకొని, జేబులో నుంచి స్ప్రే గన్‌ బయటకు తీసి, వెనక్కు కాలుస్తూ ముందుకు స్విమ్‌ చేయడం కొనసాగించాడు.

అలా ఓ గుర్తుతెలియని ద్వీపం చేరుకొని, అక్కడి నుంచి ఇతరుల సాయంతో మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. తాను ఎదుర్కొన్న పరిస్థితిని ఎవరికి చెప్పినా నమ్మరని, అయితే తాను మాత్రం ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు జాన్‌.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిశ్చార్జ్ అయిన‌వారికి మ‌ళ్లీ క‌రోనా!

వైరల్‌: ఈ వింత జీవి మీకు తెలుసా!

సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం

ఉపాసనకు థాంక్స్‌: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

నవజాత శిశువుల కోసం... క్యూట్‌ కదా!

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు