50 ప్రాయంలో నాకో గర్ల్‌ఫ్రెండ్ కావాలి..!

31 Jul, 2014 07:52 IST|Sakshi
50 ప్రాయంలో నాకో గర్ల్‌ఫ్రెండ్ కావాలి..!

ఈయన పేరు డాన్ పెరీనో.. వయసు 50 ఏళ్లు.. ఉండేది న్యూయార్క్‌లో. పాపం ఒంటరిగా ఉంటున్న డాన్‌కు ఈ వయసులో గర్ల్‌ఫ్రెండ్ కావాలనిపించింది. కానీ ఈయన ఏమైనా యువకుడా.. సెలబ్రిటీనా? అనుకోగానే గర్ల్‌ఫ్రెండ్స్ వచ్చేయడానికి..! అయినా పట్టు వదలకుండా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఇక ఇలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి.. ఈ నిర్ణయానికి వచ్చాడు. తన ఫొటో, దాని కింద..

‘గర్ల్‌ఫ్రెండ్ కోసం చూస్తున్నాను’ అనే కేప్షన్ రాసి పోస్టర్‌ను మన్‌హాటన్‌లో అతికించేశాడు. అన్నట్టు ఈ ఐడియా వర్కవుట్ అయిందండోయ్..! డాన్‌కు బోలెడు ఫోన్లు వచ్చాయంట. వారిలో తనకు సరిపోయే జోడీని వెతుక్కునే పనిలో పడ్డాడు. తన ప్రతి పనినీ మెచ్చుకునే ఓ ‘అర్థవంతమైన బంధం’ కోరుకుంటున్నానని చెబుతున్న డాన్.. అలాంటి తోడు దొరికే వరకు పోస్టర్ల కాన్సెప్ట్ వదలడంట!

మరిన్ని వార్తలు