జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కీలక నిర్ణయం

20 May, 2020 18:18 IST|Sakshi

ఎట్టకేలకు దిగొచ్చిన అమెరికా ఫార్మా దిగ్గజం

బేబీ పౌడర్‌ అమ్మకాలను నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్

అమెరికా, కెనడాలో  బేబీ  పౌడర్‌ అమ్మకాలు నిలిపివేత


సాక్షి,న్యూడిల్లీ : ఎట్టకేలకు  వివాదాస్పద  బేబీ పౌడర్‌ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్  నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నామని  అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ  అధికారికంగా ప్రకటించింది.  వేలాది కేసులు,   కోట్ల డాలర్ల  పరిహారం లాంటి  అంశాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండించిన సంస్థ ఉత్తర అమెరికాలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని  మంగళవారం ప్రకటించింది.  వినియోగదారుల అలవాట్లలో మార్పులు,   తప్పుడు సమాచారం, వ్యా‍జ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్  అండ్‌ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది.

రాబోయే నెలల్లో  ఈ రెండు  దేశాల మార్కెట్లలో అమ్మకాలను నిలిపివేస్తున్నామని నార్త్ అమెరికా కన్స్యూమర్ యూనిట్ ఛైర్మన్ కాథ్లీన్ విడ్మెర్ చెప్పారు.  సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రీటైల్‌ మార్కెట్లటలో అమ్మకాలు కొనసాగుతాయని  ఆమె చెప్పారు.  అయితే 1980 నుండి మార్కెట్లో ఉన్న తమ కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్‌ అమ్మకాలు అమెరికా కెనడాలో కొనసాగుతాయన్నారు. మొదట 1890 లలో బేబీ-పౌడర్ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించిందని కంపెనీ బ్లాగ్ తెలిపింది. (కోవిడ్‌-19: రోల్స్‌ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన)

కాగా 2014  నుంచి జాన్సన్‌ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌, ఇతర ఉత్పత్తుల్లో ఆస్‌బెస్టాస్ ఆనవాళ్లు న్నాయన్న  ఆరోపణలు  వెల్లువెత్తాయి.  ఈ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో  వేలాది (16,000 కంటే ఎక్కువ) కేసులను సంస్థ ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలో ఒక బాటిల్ బేబీ పౌడర్‌లో కలుషిత, ప్రమాదకర అవశేషాలను కనుగొన్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో 33వేల బాటిళ్లను మార్కెట్ నుండి  వెనక్కి తీసుకుంటున్నట్టు జె అండ్ జె తెలిపింది. మరోవైపు  న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో 16,000కు పైగా సూట్లను పర్యవేక్షిస్తున్న అలబామా న్యాయవాది లీ ఓ'డెల్ మాట్లాడుతూ అమ్మకాలను నిలిపివేసే ప్రకటన విచారణ నుంచి తప్పించుకునేందుకే అని వ్యాఖ్యానించారు. అండాశయ క్యాన్సర్‌కు కారణమైన సంస్థ  ఉత్పత్తులను నిలిపివేయాలని  ఆయన ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు)

మరిన్ని వార్తలు