జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి భారీ జరిమానా!

24 Jun, 2020 20:10 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రముఖ పార్మస్యూటికల్‌ దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీని నష్టపరిహారం కింద 2.1 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందిగా అమెరికా కోర్టు ఆదేశించింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌  ఉత్పత్తుల్లో ఒకటైన బేబీ టాల్కమ్‌ పౌడర్‌ను ఉపయోగించడం  వల్ల అండాశయ కాన్సర్‌ వస్తుందని దాదాపు చాలా మంది వివిధ కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి 2018లో మిస్సోరి కోర్టు విధించిన 4.4 బిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని దాదాపు సగానికి పైగా తగ్గించి 2.1 బిలియన్‌ డాలర్లకు కుదించింది. ఈ సొమ్మును టాల్కమ్‌ పౌడర్‌ను ఉపయోగించడం వల్ల నష్టపోయిన వారికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. (అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు!)

పౌడర్‌లో ఉండే అస్‌బెస్టాస్‌ కారణంగా కాన్సర్‌ కలుగుతుందని  తెలిసినా కస్టమర్లను ఆ విషయం గురించి హెచ్చరించకుండా కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోందని కోర్టులో కొంత మంది వినియోగదారులు కేసు వేశారు. దీనిపై విచారించిన కోర్టు దీని వలన జరిగిన ఫిజికల్‌, మెంటల్‌, ఎమోషనల్‌ నష్టానికి వెలకట్టలేమని కోర్టు పేర్కొంది.  దీనిపై స్పందించిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రతినిధి ఈ విషయంలో పై కోర్టును సంప్రదిస్తామని వెల్లడించారు. (‘కరోనా పరీక్షలు తగ్గించమనలేదు’)

అమెరికాలో అనేకమంది ఈ కంపెనీ,  టాల్కమ్‌పౌడర్‌ వాడటం వలన కాన్సర్‌ వస్తుందని హెచ్చరించకుండా ఉత్పత్తులను అమ్ముతుందని కోర్టులో కేసులు వేశారు. దీని వలన అండాశయ క్యాన్సర్‌కు గురవుతున్నామని తెలిపారు. 2017లో ఈ కంపెనీ వల్ల తనకు కాన్సర్‌ వచ్చిందని కేసు వేసిన మహిళలకు మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది. అమెరికాలో కంపెనీ పై అనేక మంది కేసులు వేస్తుండటంతో బేబీ టాల్కమ్‌ పౌడర్లను యూఎస్‌ఏ, కెనడాలో విక్రయించబోమని ప్రకటించింది. ఈ రెండు దేశాలలో మినహా మిగిలిన దేశాలలో తమ ఉత్పత్తులు విక్రయిస్తామని పేర్కొంది. 

(జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు రికార్డ్‌ జరిమానా)

మరిన్ని వార్తలు