ప్రజల నిరసనలతో దిగొచ్చిన జోర్డాన్‌ కింగ్‌

1 Jun, 2018 21:02 IST|Sakshi

ఇంధన ధరల పెరుగుదల నిర్ణయం వెనక్కి: కింగ్‌  అబ్దుల్లా II

 అమ్మాన్‌: దేశంలో ఇంధన‌, విద్యుత్‌ ధరలు పెంచుదాం అనుకున్న జోర్డాన్‌ కింగ్‌ అబ్దుల్లా II కి  ఊహించని షాక్‌ తగిలింది.  ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంధన ధరల పెరుగుల నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసమర్థ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని  దేశ ప్రజలు గతరెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రోడ్లను స్తంభింపజేశారు. టైర్లు కాలపెడుతు రోడ్లను దిగ్బందం చేయడంతో ప్రభుత్వం ధరల పెరుగుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కింగ్‌ అబ్దుల్లా తెలిపారు.

కోటి జనాభా గత జోర్డాన్‌లో వనరుల కొరత, పేదరికం, నిరుద్యోగంతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ జనాభాలో 19 శాతం నిరుద్యోగులు, 20శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు ఆ దేశ గణాంకాలు చెప్తున్నాయి. 2016లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి తీసుకున్న 723 మిలియన్లు రుణాన్ని చెల్లించి భవిషత్తుల్లో మరిన్ని రుణాలు పొందే విధంగా ఆర్థిక సంస్కరణ చేపట్టింది. దానిలో రాయితీలు తగ్గించి ట్యాక్స్‌లు పెంచాలని ప్రభుత్వం భావించింది. ఒక్కసారిగా ఇంధనంపై 5.5 శాతం, విద్యుత్‌పై 19 శాతం ధరలు పెంచడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైయాయి. 

మరిన్ని వార్తలు