అసాంజేకు తప్పిన గండం

3 Apr, 2017 12:59 IST|Sakshi
అసాంజేకు తప్పిన గండం
లండన్‌: వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు గండం తప్పింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఈక్వెడార్‌లోనే కొనసాగేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీనే తాజాగా మరోసారి విజయానికి చేరువలో ఉండటంతో ఆయన పునరావాసానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండనుంది. వాస్తవానికి ఈక్వెడార్‌ నుంచి 30 రోజుల్లోగా అసాంజేను వెళ్లగొట్టాలని ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న లెప్టిస్ట్‌ పార్టీని రైట్‌ వింగ్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

దీంతో అసాంజేలో కొంత ఆందోళన నెలకొంది. స్వీడన్‌లో లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లండన్‌ రాయబార కార్యాలయం అయిన ఈక్వెడార్‌లో ఉంటున్నారు. ఆయనకు లెప్టిస్ట్‌ పార్టీ ఆశ్రయం కల్పించింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి లెఫ్టిస్ట్‌ పార్టీనే అధికారానికి చేరువవుతున్న నేపథ్యంలో ఆయన ఈక్వెడార్‌లోనే ఇక ఉండిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధి లెనిన్‌ మోరెనో మాట్లాడుతూ తాము అసాంజేకు ఆశ్రయం ఇస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తలు