అరటిపండుపై కాలేసిన విదేశీ సమంత.. వైరల్‌!

8 May, 2018 18:41 IST|Sakshi

అరటిపండు తొక్కపై కాలేస్తే జారిపడతాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరు స్వయంగా దీనిని టెస్టు చేసి మరీ తెలసుకొని ఉండరు. ఎవరు మాత్రం తెలిసి.. తెలిసి.. అరటితొక్కపై కాలేస్తారు. కానీ, ఓ మహిళ మాత్రం ఏకంగా అరటిపండుపై కాలేసింది. అమాంతం జారిపడింది. ఆ వీడియోను తీసి ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సమంత అనే విదేశీ మహిళ ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. రోడ్డు మీద అరటిపండును పారేసి.. దానిపై అమాంతం ఆమె దూకేశారు. నిజానికి ఆమె ఉద్దేశం అరటిపండును చితక్కొట్టడం కావొచ్చు. అరటిపండు కాలేస్తే.. అది ఊరుకుంటుందా.. అమాంతం జర్రున జారి దబేల్మని పడిపోయారు. నాలుగు నిమిషాల నిడివిగల వీడియోను ఇప్పటివరకు ట్విట్టర్‌లో 3.99 మిలిమన్ల (సుమారు 40 లక్షల) మంది చూశారు. అరటి తొక్కపై కాలేస్తే.. జారిపడతామని వినడమేగానీ.. ఇలా నేరుగా చూసిందెప్పుడూ లేదు.. కొందరు కామెంట్‌ చేస్తుండగా.. ప్రయోగం చేసి.. దెబ్బలు తగిలించుకొని మరీ ఇంత చిన్నవిషయం తెలుసుకోవాలా.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు